
- ఈసీకి పంపిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్
- జాబితాలో సీఎం, పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్, మంత్రులు
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల ప్రచారం కోసం 40 మందితో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ను ఖరారు చేశారు. ఈ లిస్ట్ కేంద్ర ఎన్నికల సంఘం సెక్రటరీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవోకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేసీ వేణుగోపాల్ పంపారు. స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, తుమ్మల, పొన్నం ప్రభాకర్తో పాటు కేబినెట్ మంత్రులంతా ఉన్నారు.
వీరితో పాటు ఎంపీలు రేణుకాచౌదరి, అనీల్ కుమార్ యాదవ్, మల్లు రవి, బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ నేతలు వంశీచందర్ రెడ్డి, సంపత్ కుమార్, జానారెడ్డి, సునీత ముదిరాజ్, సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, జక్కిడి శివచరణ్ రెడ్డి, యడవల్లి వెంకటస్వామి, ఎమ్మెల్యే దానం నాగేందర్, కుసుమ కుమార్, షబ్బీర్ ఆలీ, అజారుద్దీన్, ఎమ్మెల్సీ విజయశాంతి, మధుయాష్కీ గౌడ్, రాములు నాయక్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు.