అభివృద్ధికి పునాదులు వేసిందే కాంగ్రెస్

అభివృద్ధికి పునాదులు వేసిందే కాంగ్రెస్
  • బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కు లేదు
  • ఏఐసీసీ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణి కమిటీ కన్వీనర్ కోదండ రెడ్డి

ముషీరాబాద్,వెలుగు: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఎప్పుడు ఉన్నా సంస్కరణలను తీసుకువచ్చిందని ఏఐసీసీ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణి కమిటీ కన్వీనర్ కోదండరెడ్డి పేర్కొన్నారు. సంస్కరణలతోనే దేశం అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నారు. బీజేపీ పాలనలో  ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతూ ప్రధాని మోదీ ఒక్క సంస్కరణలు కూడా తీసుకు రాలేదని విమర్శించారు. ఆదివారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఓ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

1981 కంటే ముందే సిటీలో అభివృద్ధికి పునాదులు వేసింది కాంగ్రెస్సే అని గుర్తు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసే ముందు గ్రేటర్ సిటీకి కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  సిటీ అభివృద్ధికి ఏం చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ  అభ్యర్థి దానం నాగేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ప్రోటోకాల్ కార్యదర్శి సురేశ్​, జీఎన్ కేశవ్, కన్నా డేనియల్, యాదగిరి, ఎస్తేర్ రాణి, వి సురేష్, గజ్జెల సూర్యనారాయణ, నల్లవెల్లి అంజిరెడ్డి, అంజయ్య గౌడ్, అబ్దుల్ ఖాదీర్, వేణు బాబు గౌడ్, డీకే శ్రీనివాస్, పులి రాజు తదితరులు పాల్గొన్నారు.