
బండ రావిలాల, చిన్న రావిలాలలో 56 మంది మృతి: బక్క జడ్సన్
హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో అక్రమ మైనింగ్‌తో ఇప్పటివరకు 56 మంది చనిపోయారని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ తెలిపారు. మండలంలోని బండ రావిలాల, చిన్న రావిలాలలో అక్రమ మైనింగ్ ఆపాలంటూ గ్రామస్తులు 412 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా..
ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. శుక్రవారం కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డితో కలిసి గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అక్రమ మైనింగ్‌పై తాము జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, దీంతో రంగారెడ్డి కలెక్టర్‌కు కమిషన్ నోటీసులు కూడా ఇచ్చిందని గుర్తుచేశారు.
అక్కడ మైనింగ్ చేస్తున్న భూములను గతంలో దళితులకు కాంగ్రెస్ అసైన్ చేసిందన్నారు. కేసీఆర్ అండతో మైనింగ్ మాఫియా అక్కడ పాగా వేసిందని ఆరోపించారు.