‘విధుల్లోకి చేర్చుకోమని సునీల్ శర్మ అనడం ఏంటీ?’

‘విధుల్లోకి చేర్చుకోమని సునీల్ శర్మ అనడం ఏంటీ?’

విధుల్లోకి చేరుతామన్న ఆర్టీసీ కార్మికులను చేర్చుకోమని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ చెప్పడం చాలా దుర్మార్గమని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆర్టీసీ సమ్మె పై సీఎం కేసీఆర్ లేదా రవాణా శాఖ మంత్రి మాట్లాడాలి కానీ ఆర్టీసీ ఎండీ మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. IAS లు వారి పరిధి దాటి మాట్లాడుతున్నారన్నారు.  కొంతమంది పోలీస్ అధికారులతో,ఐఏఎస్ అధికారులతో కేసీఆర్ రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నారని అన్నారు.

ముఖ్యమంత్రి రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నాడని భట్టి అన్నారు.  ఆయనకు రాజ్యాంగం అంటే లెక్కలేదని అన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకొని సీఎల్పీ విలీనం అయిందని చెప్పారు. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యే లు వేర్వేరు తేదిల్లో పార్టీ మారుతున్నామని చెప్పారు. ఇది ఏ విధంగా విలీనం అవుతుందని భట్టి ప్రశ్నించారు. సీఎల్పీ ,టిఆర్ఎస్ ఎల్పీ లో విలీనం అయిందని సీఎం..  సభను తప్పుదారి పట్టించారని ఆయన అన్నారు. ప్రజా ఉద్యమం చేస్తామని, ప్రజా క్షేత్రంలోకి దిగుతామని భట్టి అన్నారు.

ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యా కేసీఆరా.? కొడుకు కేటీఆరా..?:  జీవన్ రెడ్డి

కేసీఆర్ మొండివైఖరి వల్లే ఆర్టీసీ సమస్య జఠిలం అయిందని కాంగ్రెస్  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. డీజిల్ పెంపు తోనే సంవత్సరానికి 720 కోట్ల భారం ఆర్టీసీ పైన పడుతుంది. బస్ పాస్ రాయితీలకు మరో 500 కోట్ల భారం పడుతుంది. ఆ భారాన్నీ ప్రభుత్వం భర్తీ చేయాలి.  GHMC  నుండి 300 కోట్లు ఆర్ధికంగా సపోర్ట్ చేయాలని కేసీఆరే చట్టం చేశారు. ఒక సంవత్సరం అమలు చేసిన తర్వాత ఆయన కొడుకు కేటీఆర్ అదే చట్టాన్ని రద్దు చేశారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యా కేసీఆరా.? కొడుకు కేటీఆరా..? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారు. ఆర్టీసీ పైన కేంద్రం కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

Congress leader Bhatti Vikramarka fires on CM KCR, RTC MD Sunil Sharma