కేసీఆర్ మాటలు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది: భట్టి

కేసీఆర్ మాటలు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది: భట్టి

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేంద్రంలో చక్రం తిప్పుతానంటున్న కేసీఆర్ మాటలు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్రజా స్వామ్య పరిరక్షణ యాత్రలో బాగంగా కోల్లాపూర్ వెళ్లుతూ నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటలో భట్టి  మీడియా మాట్లాడారు. ఈ సందర్భంగా  ప్రతిఫక్ష పార్టీ ఎమ్మెల్యేలను డబ్బుతో కోనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఆపహస్యం చేస్తున్నారని ఆయన అన్నారు. సొంత రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతుకనీయట్లేదని అన్నారు.

ప్రాజెక్టుల రీడీజైన్ల పేరుతో కేసీఆర్ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని, మిషన్ భగీరథ పథకంలో అంచనాలను విపరీతంగా పెంచి తనకు ఆనుకూలమైన కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారని ఆరోపించారు.

తాను చేసిన అవినీతి బయట పడకూడదనే ఫెఢరల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారని అన్నారు. రాబోయే కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లో లేకుంటే తాను చేసిన ఆర్థిక ఆరాచకాలు బయటకు వస్తాయని,  భయాందోళనలతో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ నాటకాలాడుతున్నారని భట్టి విక్రమార్క అన్నారు.