-
కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం ఫైర్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు మంద కృష్ణ మాదిగకు లేదని ఆ పార్టీ సీనియర్ నేత గజ్జెల కాంతం ఫైర్ అయ్యారు. శుక్రవారం గాంధీభవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీకి 2017 నుంచి మద్దతు ఇస్తున్న మందకృష్ణ లాంటి వ్యక్తి రేవంత్‌ను ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. వర్గీకరణపై రేవంత్ కమిటీ వేశారని, చైర్మన్‌గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారని, ఆయన నాయకత్వంలో వర్గీకరణ జరుగుతుందని తెలిపారు. దీనిపై మరో జ్యుడీషియల్ కమిటీ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణలో వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.