బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కవితకు నోటీసుల నాటకం: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కవితకు నోటీసుల నాటకం: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చిన తీరు డైలీ సీరియల్​ను తలిపిస్తోందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ సీట్లకు గండి కొట్టేందుకే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి.. కవితకు నోటీసుల నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. 

శుక్రవారం గాంధీ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎంపీ ఎన్నికల కోసం బీజేపీ,  బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరిందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా రెండేళ్ల కింద మేడారం వెళ్లి సమ్మక్క..సారలమ్మ పండుగను జాతీయ పండుగగా ప్రకటిస్తామని చెప్పగా, ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటిస్తామని అనలేదని చెప్తున్నారని మండిపడ్డారు. సమ్మక్క.. సారలమ్మలనే మోసం చేసిన బీజేపీ నేతలకు, తెలంగాణ ప్రజలను మోసం చేయడం పెద్ద పనేం కాదన్నారు.