భూ తగాదాల వ్య‌వ‌హారంలో కాంగ్రెస్ నేత కిడ్నాప్

భూ తగాదాల వ్య‌వ‌హారంలో కాంగ్రెస్ నేత కిడ్నాప్

భూ తగాదాల వ్య‌వ‌హారంలో కాంగ్రేస్ నేత కిడ్నాప్ కలకలం సృష్టించిన ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలో జ‌రిగింది. షాద్ నగర్ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో చాలా కాలంగా ఓ భూ వివాదం చోటు చేసుకుంది. ఈ గొడవలు ఇరువర్గాల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ వ్యవహారం పై పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు షాద్ నగర్ పోలీసులు. అయితే శుక్రవారం షాద్ నగర్ లో జడ్చర్లకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ సింగిల్విండో చైర్మన్ రామచంద్రారెడ్డి తన వాహనంలో కూర్చుని ఉండగా షాద్ నగర్ కు చెందిన అన్నారం ప్రతాప్ రెడ్డి.. రామచంద్రారెడ్డిని కారులోంచి దించి, తన వెంట తీసుకు వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షి రామచంద్రారెడ్డి డ్రైవర్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే చాలా కాలంగా భూమి విషయంలో ప్రతాప్ రెడ్డికి రామచంద్ర రెడ్డికి మధ్య భూ వివాదం ఉందని స్పష్టం అవుతోంది. కొన్ని రోజుల క్రితమే ఈ విషయంలో పోలీసులు కేసు కూడా నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి. రామచంద్రారెడ్డిని తాజాగా ప్రతాప్ రెడ్డి తన వాహనంలో తీసుకెళ్లడం విషయంతో కలకలం రేపుతుంది. రామచంద్రారెడ్డిని బలవంతంగా తీసుకు వెళ్లారా .. ఏదైనా మరో విషయంలో తీసుకెళ్లారా? అన్న విషయం తెలియాల్సి ఉంది. రామచంద్రారెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్న‌ట్లు తెలిపారు పోలీసులు.