సారా కేసులో ఇరుక్కున్నోళ్లు..పార్టీ పెడ్తే ఎవరూ చేరరు..కవితపై మధుయాష్కీ విమర్శలు

సారా కేసులో ఇరుక్కున్నోళ్లు..పార్టీ పెడ్తే ఎవరూ చేరరు..కవితపై మధుయాష్కీ విమర్శలు

హైదరాబాద్, వెలుగు: సామాజిక బతుకమ్మ పేరుతో మహిళలకు అండగా ఉంటున్న విమలక్క పార్టీ పెడ్తే జనం ఆదరిస్తారని.. కానీ సారా కేసులో ఇరుక్కున్న కవిత పార్టీ పెడ్తే, అందులో ఎవరూ చేరరని కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు. అవసరమైతే తీన్మార్ మల్లన్న పెట్టిన పార్టీని జనం ఆదరిస్తారన్నారు. శనివారం గాంధీభవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దోచుకున్న డబ్బును దాచుకునేందుకే కవిత జాగృతి సంస్థను పెట్టిందని ఆయన మండిపడ్డారు.

 ‘‘సారా కుంభకోణంలో ఉన్నోళ్లు బీసీల గురించి నీతులు చెప్తే ఎవరు నమ్ముతారు? 6 నెలల కింద అన్నపై అలిగిన కవిత.. ఇప్పుడు బావను విమర్శిస్తున్నది. ఇలాంటి నీతి లేని రాజకీయాలు చేసే వాళ్లను తెలంగాణ జనం ఆదరించరు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ కన్వెన్షన్‌‌కు నోటీసులు ఇప్పించి, నష్టపోయిన రైతులకు జాగృతి తరఫున పరిహారం అందిస్తామని చెప్పి కవిత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు” అని ఆరోపించారు. ఇంట్లో నుంచి కవిత బయటకు రావడమనేది కేసీఆర్ రచించిన నాటకంలో భాగమేనని అన్నారు.