ఆర్టీసీతో ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలి: మల్లు రవి

ఆర్టీసీతో ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలి: మల్లు రవి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ను పక్కన పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్చలు చేపట్టాలని కోరారు కాంగ్రెస్ నాయకులు మల్లు రవి. గాంధీ భవన్ లో శుక్రవారం మాట్లాడిన ఆయన…  ఆర్టీసీ కార్మికులు పెద్ద మనసుతో ఒక అడుగు వెనక్కు తగ్గారని అన్నారు. 41 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడం శోషణీయమని చెప్పారు.

చర్చలు లేవు, రాజీ లేదు, సెల్ఫీ డిస్మిస్ అంటూ మొండి వైఖరి ప్రదర్శించడం ప్రభుత్వానికి తగదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చలు జరగాలని AP లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కమిటీ వేసిన నేపథ్యంలో ఇది కూడా ఒక ముఖ్య అంశంగా పరిశీలించాలని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ క్రియాశీలంగాపని చేసిందని వాళ్లకు ఉద్యమాలు కొత్తకాదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం చట్ట పరిధి దాటి, రాజ్జ్యాంగ రహితంగా పని చేస్తున్నారని ఆయన అన్నారు.