కాంగ్రెస్ నేత మానవతారాయ్కు ఓయూ డాక్టరేట్

కాంగ్రెస్ నేత మానవతారాయ్కు ఓయూ డాక్టరేట్

ఓయూ/ కల్లూరు, వెలుగు: కాంగ్రెస్ నేత మానవతారాయ్​కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. హైదరాబాద్ మొట్టమొదటి సీఎం డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు జీవితం– సాహిత్యం అనే సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ వరించింది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య నిత్యానందరావు మార్గదర్శకత్వం వహించారు.

ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన మానవతారాయ్ తెలంగాణ ఉద్యమంలో శీలక పాత్ర పోషించారు. ఓయూ లా కాలేజీలో ఎల్‌‌‌‌‌‌‌‌ఎల్​బీ పూర్తి చేసి, హైకోర్టు న్యాయవాదుల సంఘంలో శాశ్వత సభ్యుడిగా కొనసాగుతున్నారు.

విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్​గా పోరాటాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు డాక్టరేట్​రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.