
TSPSC లీకేజీపై సీబీఐతో విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం బాధకరమన్నారు. సిరిసిల్లాలో ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుటుంబాన్ని జీవన్ రెడ్డి పరామర్శించారు. ఉపాధి లేకపోవడం వల్లే నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు జీవన్ రెడ్డి. కనీసం ప్రైవేటు సెక్టార్ లోనైనా ఉద్యోగాలు కల్పిస్తే నిరుద్యోగుల ఆత్మహత్యలను నివారించవచ్చునని అన్నారు.
మరోవైపు నవీన్ కుటుంబాన్ని వైఎస్ ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. జాబుల భర్తీ లేకపోవడం వల్లే నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని షర్మి్ల అన్నారు. రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగమని చెప్పిన కేసీఆర్.. ఒక్క ఉద్యోగమైన ఇచ్చాడా అని ప్రశ్ని్ంచారు షర్మిల. TSPSC లో స్కామ్ జరిగితే తనకేం సంబంధం లేదని మంత్రి కేటీఆర్ చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్న కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.