ప్రభుత్వం దళితుల భూములను గుంజుకుంటోంది

ప్రభుత్వం దళితుల భూములను గుంజుకుంటోంది

మందమర్రి, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్​ రూ.30వేల కోట్లు లంచం తీసుకున్నాడని మాజీ విప్​, కాంగ్రెస్ ​లీడర్​ నల్లాల ఓదెలు ఆరోపించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం మందమర్రిలో ఆజాద్​కి గౌరవ్​ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక దొరలబంగ్లా ఏరియాలో మంచిర్యాల జడ్పీ చైర్​పర్సన్​నల్లాల భాగ్యలక్ష్మి, నల్లాల ఓదెలు యాత్రను ప్రారంభించారు. ఓదెలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, శ్మశానవాటికల పేరుతో దళితుల భూములను గుంజుకున్నాడన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గంలో రజాకార్ల​పాలన సాగిస్తున్నాడన్నారు. 

కాంగ్రెస్ పాదయాత్రకు వచ్చే వాళ్లను టీఆర్ఎస్​లోని దొంగలీడర్లతో ఎమ్మెల్యే బాల్క సుమన్ ​అడ్డుకుంటున్నాడని, అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, అరెస్టులు చేయిస్తే  పోలీస్​స్టేషన్ల ముందే కూర్చుంటామన్నారు. తమవారిపై దాడులు చేయిస్తే ఎమ్మెల్యే ఆఫీస్​ను కాలవెట్టడానికి కూడా వెనుకడబోమన్నారు. బాల్కసుమన్​ను నియోజకవర్గం నుంచి తరిమికొట్టాల్సిన బాధ్యత సింగరేణియులు, యువతపై ఉందన్నారు. ఐఎన్టీయూసీ జనరల్​సెక్రటరీ కాంపెల్లి సమ్మయ్య, తేజావత్​రాంబాబు, మండ భాస్కర్, వెంకటస్వామి పాల్గొన్నారు.