
పటాన్చెరు, వెలుగు: సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ నాంది పలికారని కాంగ్రెస్ నేత నీలం మధు అన్నారు. బుధవారం రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మండలంలోని చిట్కుల్ ఎన్ఎంఆర్ క్యాంపు ఆఫీసులో ఆయన రాజీవ్‌గాంధీ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత రాజీవ్‌గాంధీయే అని గుర్తుచేశారు. దేశంలో పేదరికాన్ని పారదొలి సమసమాజ స్థాపనకు కృషి చేసిన ఆయనను ఎప్పటికీ మరవలేమని కొనియాడారు. కార్యక్రమంలో ఎన్ఎంఆర్ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
నారాయణ్ ఖేడ్: రాజీవ్ గాంధీ హయాంలోనే దేశం సాంకేతికంగా అభివృద్ధి చెందినదని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌నాయకులతో కలిసి రాజీవ్‌గాంధీ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం అభివృద్ధి చెందడంలో అద్భుతమైన నిర్ణయాలు తీసుకొని యువతను టెక్నాలజీ వైపు మళ్లించి ఆర్థిక అభివృద్ధిలో సంచలనాలు సృష్టించారన్నారు.
జోగిపేట: రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కార్యకర్తలు ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశం మాట్లాడుతూ చిన్న వయసులోనే దేశ ప్రధాని పదవిని అధిష్టించిన రాజీవ్ గాంధీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. దేశ భవిష్యత్‌కు ఆయన నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి ఫలాలు అందిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ప్రవీణ్, లక్ష్మణ్, దుర్గేశ్, చందర్, ఆత్మ కమిటీ మెంబర్ మధు, కృష్ణ, నందు, అనిల్, అబ్బాస్ అలీ, శంశీర్, రాజు, చోటు పాల్గొన్నారు.