కేసీఆర్ కు ఉన్న బలమెంత? ఆయన అనుభవం ఎంత?

కేసీఆర్ కు ఉన్న బలమెంత? ఆయన అనుభవం ఎంత?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల థర్డ్ ఫ్రంట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండడంపై పీసీసీ మాజీ  అధినేత  పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఓ భ్రమగానే మిగిలిపోతుందన్నారు.కేసీఆర్ తీరు చూస్తుంటే... కూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీస్తా అన్నట్టుగా ఉందన్నారు. దేశానికి నాయకత్వం వహించడానికి కేసీఆర్ కు ఉన్న బలమెంత? ఆయన అనుభవం ఎంత? అని  ప్రశ్నించారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు పొన్నాల. తెలంగాణ ప్రజల ప్రాణత్యాగాలను, పోరాటాలను గుర్తించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణను అప్పుల పాలు చేసిన కేసీఆర్.. రాష్ట్రాన్ని బ్రష్టుపట్టించింది కాక .. ఇప్పుడు  దేశం వైపు చూస్తున్నారని  విమర్శించారు. అసలు దేశానికి నాయకత్వం వహించేంత బలం కేసీఆర్ కు ఉందా అని అన్నారు. కేసీఆర్ చెబుతున్న 'బంగారు భారత్' నినాదం వింటుంటే నవ్వొస్తోందని అన్నారు పొన్నాల లక్ష్మయ్య.

మరిన్ని వార్తల కోసం..

ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు