ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు

ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు
  • ఉద్యోగంలో ఉన్న వారికి సుఖం లేదు
  • మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఉద్యోగం ఉన్న వారికి ఉద్యోగ భద్రత ఉందన్న సుఖం కూడా లేకుండా చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా అధికారాలు లేవని.. అధికారాలన్నీ కేసీఆర్ వద్దే ఉన్నాయని విమర్శించారు. వీఆర్ఏల నిరసన దీక్షలో ఈటల రాజేందర్ పాల్గొని మద్దతు ప్రకటించారు.  
2014 శివరాత్రి నాడు పే స్కేల్ , ప్రమోషన్ ఇస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గుర్తు చేశారు.  రెవెన్యూ డిపార్ట్ మెంట్లో చేరితే  పదోన్నతులు సాధించుకుని ఉన్నత పదవులకు పోవచ్చునని వీఆర్ఏలుగా చేరితే  సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను నాశనం చేశాడన్నారు. రెవెన్యూ శాఖకు మంత్రి కాదు కదా, ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా లేడన్నారు.  ఎమ్మార్వో లపైన పెట్రోల్ పోసిన  చరిత్ర దేశంలో ఎక్కడా లేదు.. కేవలం తెలంగాణలో మాత్రమే ఉందన్నారు.

 

 

ఇవి కూడా చదవండి

ప్రజల కష్టార్జితాన్ని కాంట్రాక్టర్లకు కట్టబెడుతుండు

భీమ్లా నాయక్‌ ట్రైలర్‌పై RGV సంచలన ట్వీట్‌