పేదవాడి నోట్లో మోడీ మట్టి కొడుతున్నారు

పేదవాడి నోట్లో మోడీ మట్టి కొడుతున్నారు

ఏఐసీసీ ఆదేశాల మేరకు 'ఆజాదీకా అమృత్స' ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆగస్టు 9 నుండి 17 వరకు 125 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఆఫీసులో పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ: ఆగస్టు 9న క్విట్ ఇండియా రోజును పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ చౌరస్తా నుండి నా పాదయాత్ర ప్రారంభమౌతుందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద ముగియనున్నదని తెలిపారు.

పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో నెలకొన్న ప్రజా సమస్యలను తెలుసుకోవడం, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఈ పాదయాత్ర సాగుతుందిని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. దేశ స్వాతంత్ర సమరంలో కాంగ్రెస్ పాత్రతోపాటు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో పార్టీ రోల్ ను వివరిస్తూ పాదయాత్ర నిర్వహిస్తానని చెప్పారు. మోడీ దేశంలోని 70 శాతం ప్రజల సంపాదన కేవలం ఇద్దరు బడా వ్యాపారులకు దోచిపెడుతూ పేదవాడి నోట్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. మన నీళ్ళు, నిధులు, నియామకాలు మనకేనన్న కేసీఆర్ బూటకపు హామీలతో వేలకోట్ల అవినీతికి పాల్పడుతున్నారు. మిగులు బడ్జెట్ తో ఉండే తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేశాడని విమర్శించారు.