Karur stampede: సీఎం స్టాలిన్, విజయ్ కి రాహుల్ గాంధీ ఫోన్

Karur stampede: సీఎం స్టాలిన్, విజయ్ కి రాహుల్ గాంధీ ఫోన్

తమిళనాడులోని కరూర్​ లో జరిగిన తొక్కిసలాటలో 40 మంది మృతిచెందిన విషయం ఘటనకు సంబంధించి కాంగ్రెస్​ ఎంపీ, పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ ఆరా తీశారు. సోమవారం( సెప్టెంబర్​29)తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఫోన్​ చేసి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగితెలుసుకున్నారు. తొక్కిసలాటలో చిన్నారులతో 40 మంది చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన అందించాలని చెప్పారు. మరోవైపు టీవీకే చీఫ్​ విజయ్​కి కూడా ఫోన్​ చేసి మాట్లాడారు రాహుల్​ గాంధీ.

ఈ విషయాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్​ తన సోషల్ మీడియా ప్లాట్​ ఫాం X లో షేర్​ చేశారు. విషాదఘటనపై కాంగ్రెస్​ఎంపీ, పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అందుతున్న చికిత్స, సేవలను అడిగి తెలుసుకున్నారని స్టాలిన్​ పోస్ట్​ షేర్​ చేశారు. 

శనివారం రాత్రి టీవీకే చీఫ్​ విజయ్​కార్నర్​ మీటింగ్​40 మంది ప్రాణాలు బలిగొన్న విషాదకర ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, యువకులు ఉన్నారు. ఊహించినదానికంటే ఎక్కువ మంది విజయ్ మద్దతుదారులు మీటింగ్​ రావడం, విజయ్​ ఆలస్యంగా సభకు రావడం వల్లే ప్రమాదం జరిగిందని  విమర్శలొచ్చాయి. 

విషాదకర ఘటనపై స్పందించిన విజయ్.. తీవ్రవిషాదంలో ఉన్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 2లక్షల చొప్పున పరిహారం ప్రకటాంచారు. 

ALSO READ : విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

మరోవైపు ప్రధాని మోదీ కూడా ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, గాయపడివారికి రూ. 50వేలచొప్పున ఎక్స్​ గ్రేషియా ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 10లక్షలు, గాయపడినవారికి రూ. 1లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది.

మృతుల కుటుంబాలకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ రూ.1 కోటిరూపాయలు పరిహారం ప్రకటించింది.తమిళనాడు బీజేపీ బాధితులకు ప్రతి ఒక్కరికి రూ.1 లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది.