విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం (సెప్టెంబర్ 29) అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఆలయ అర్చకులు, సిబ్బంది భక్తులకు తగిన ఏర్పాటు చేశారని చెప్పారు.

దసరా శరన్నరాత్రి ఉత్సవాలలో భాగంగా మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. దీంతో భక్తులు వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. ఆలయ పరిసరసాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 

►ALSO READ | తిరుమలలో వైభవంగా గరుడ సేవ.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు

మూలా నక్షత్రం రోజు సరస్వతి దేవిని దర్శించుకుని పూజలు చేస్తే.. విద్యాబుద్ధులు,  చక్కని తెలివితేటలను ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు. మూలా నక్షత్రం శ్రీఅమ్మవారి జన్మనక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతిగా శక్తిస్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీదుర్గాదేవికీ.. శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ అవతారంలో అలంకరించబడుతుంది. మూలానక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి  దుర్గమ్మను ఆరాధిస్తారు.