యూపీలో జంగల్ రాజ్ కు డబుల్ ఇంజిన్ సర్కారు గ్యారెంటీ : రాహుల్​ గాంధీ

యూపీలో జంగల్ రాజ్ కు డబుల్ ఇంజిన్ సర్కారు గ్యారెంటీ : రాహుల్​ గాంధీ

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే జంగల్ రాజ్‌‌(ఆటవిక రాజ్యం)కి గ్యారెంటీ అని కాంగ్రెస్‌‌ పార్టీ అగ్రనేత రాహుల్‌‌గాంధీ విమర్శించారు. బీజేపీ, మోదీ అసత్యాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. ఆ రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలే అతిపెద్ద ఉదాహరణ అని శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన యూపీలో మహిళలపై ఇటీవల జరిగిన అనేక నేరాలను ఎత్తిచూపారు. మైనర్ సోదరీమణుల మృతదేహాలు చెట్లకు వేలాడాయని, ఐఐటీ బీహెచ్‌‌యూ స్టూడెంట్​పై బీజేపీ కార్యకర్తల సామూహిక అత్యాచారం, న్యాయం లభించక ఆత్మహత్యకు పాల్పడిన మహిళా జడ్జి, రాంపూర్‌‌లో 10వ తరగతి పరీక్షలు రాసి తిరిగి వస్తున్న దళిత విద్యార్థిని హత్య తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్​లో బీజేపీ, నేరస్థుల కూటమికి వ్యతిరేకంగా  కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని రాహుల్ ​గాంధీ పిలుపునిచ్చారు.