న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్‌గాంధీపై సినీనటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ సంచలన కామెంట్లు చేశారు. రాహుల్ గాంధీ ఫోర్స్డ్ పొలిటీషియన్ అని, రాజకీయ వారసత్వ బాధితుడని అభివర్ణించారు. కంగన హిమాచల్ లోని మండి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
గురువారం ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీ ఆకాంక్షలకు బాధితుడిగా మారాడన్నారు. తన ఇష్టానికి వ్యతిరేకంగా తల్లి కోసం నాయకుడిగా మారాల్సి వచ్చిందన్నారు. బలవంతంగా రాజకీయాలు రుద్దడంతో ఆయన తీవ్రమైన ఒత్తిడి అనుభవిస్తున్నారని అభిప్రాయపడ్డారు.