డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య: దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాహుల్

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య:  దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాహుల్

ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో బిఎస్సీ సెకండియర్ చదువుతున్న ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. “ఈ విచారకరమైన క్షణంలో విద్యార్థి ఐశ్వర్య కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. బీజేపీ అనాలోచితంగా చేసిన నోట్ల రద్దు, లాక్‌డౌన్‌ దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది. ఇది నిజం” అని రాహుల్ ట్వీట్ చేశారు.బీజేపీ ప్రభుత్వ విధానాలతోనే కుటుంబాలు కుదేలయ్యాయని అన్నారు

మోదీ ఉద్దేశ్యపూర్వకంగా చేసిన నోట్ల రద్దు, లాక్ డౌన్ కారణంగా ఐశ్వర్య లాంటి అనేక మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఆమె మృతికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాగా ఐశ్వర్య మృతికి నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు ఆందోళ‌నలు చేపట్టారు.