మోడీ పాలనలో గరిష్టానికి ద్రవ్యోల్బణం

మోడీ పాలనలో గరిష్టానికి ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ: పీఎం మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఓ వైపు ప్రజలు ఇబ్బంది పడుతోంటే... వారిని మభ్య పెట్టేందుకు మోడీ మరో ప్రణాళికను సిద్ధం చేసుకోవడంలో బిజీగా ఉన్నారని రాహుల్ ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టడంలో మోడీ ఎంత నేర్పరి అయినా కొన్ని విషయాలను మాత్రం దాచలేరని స్పష్టం చేశారు. డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ. 78 కి చేరిందని,  ఎల్ఐసీ మార్కెట్ విలువలో రూ. 1.32 లక్షల కోట్లు నష్టపోయిందని తెలిపారు. ఎన్నడూలేని విధంగా  ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టానికి చేరిందన్నారు. నిరుద్యోగం బాగా పెరిగిపోయిందన్న రాహుల్... దేశంలో ఎన్నడూ లేనివిధంగా అతిపెద్ద బ్యాంకు కుంభకోణం డిహెచ్ఎఫ్ఎల్ లో చోటుచేసుకుందని రాహుల్ గాంధీ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.