శరద్ యాదవ్‌కు రాహుల్ గాంధీ నివాళి

శరద్ యాదవ్‌కు రాహుల్ గాంధీ నివాళి

కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షులు శరద్‌ యాదవ్‌ మృతదేహానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఆయన నివాసంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా శరద్ యాదవ్ కుటుంబసభ్యులను ఆయన ఓదార్చారు. శరద్ యాదవ్ చేసిన రాజకీయాల గురించి తాను చాలా నేర్చుకున్నానని రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. 

గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న శరద్ యాదవ్.. గురుగ్రామ్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఆయనకు నివాళులు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. శరద్ యాదవ్ మరణం తనను కలచివేసిందన్న మోడీ.. తన సుధీర్ఘ ప్రజా జీవితంలో ఎంపీగా, మంత్రిగా ఎన్నో సేవలందించారన్నారు. డాక్టర్‌ రామ్‌మనోహర్‌ లోహియా సిద్ధాంతాలు ఆయన్ని ప్రభావితం చేశాయని ప్రధాని తెలిపారు.