పంజాబ్ పంచాయితీపై రాహుల్ ఫోకస్

పంజాబ్ పంచాయితీపై రాహుల్ ఫోకస్

పంజాబ్ కాంగ్రెస్ నేతల పంచాయితీపై ఫోకస్ పెట్టారు  రాహుల్ గాంధీ. పార్టీ నేతల మధ్య అంతర్గత విభేధాలు చక్క బెట్టే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా ఇవాళ పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు రాహుల్. సీఎం అమరీందర్ సింగ్, సిద్దూల వ్యవహారంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ కీలకంగా ఉండటంతో గ్రూపు గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడింది అదిష్టానం.

సీఎం అమరీందర్ సింగ్, సీనియర్ లీడర్ సిద్ధూ మధ్య 20 రోజులుగా వివాదం నడుస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు పెట్టుకుని పార్టీలో ఈ గ్రూపు గొడవలు మంచిది కాదని భావించిన అదిష్టానం... రాహుల్ ను రంగంలోకి దింపింది. అమరీందర్, సిద్దూల విషయంపై ఇప్పటికే పంజాబ్ కీలక నేతలతో చర్చించారు రాహుల్. ఇవాళ మరోసారి పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. ఇక సిద్ధూ పార్టీలో కీలకంగా ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దూ ప్రచారం చేసిన 30 పైగా స్థానాల్లో పార్టీ పెలిచింది. సీఎం, సిద్ధూల మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే మొదటికే మోసం వస్తుందని భావించిన అదిష్టానం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది.