గోమారం గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతాం : కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి

గోమారం గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతాం : కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి

శివ్వంపేట, వెలుగు: మండలంలోని గోమారం గ్రామాన్ని మోడల్​గ్రామంగా తీర్చిదిద్దుతామని నియోజకవర్గ కాంగ్రస్​ఇన్​చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. గురువారం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ సబ్ ప్లాన్, ఎన్ఆర్ఈజీఎస్ కింద మంత్రి సహకారంతో రూ.40 లక్షలతో  గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్  డ్రైనేజ్ పనులను త్వరలోనే పూర్తి చేయిస్తానన్నారు. 

గ్రామంలో మంజూరైన 45 ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించి పనులు చేపట్టిన వారికి నిధులు వెంటనే విడుదల చెయ్యాలని అధికారులకు సూచించారు. అవసరమైన మరిన్ని అదనపు ఇండ్లను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లావణ్య రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, నాయకులు నవీన్ గుప్తా, కరుణాకర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, కమలాపూర్ సింగ్, షేక్ అలీ, అరుణ్ కుమార్, నరసింహారెడ్డి పాల్గొన్నారు.