
కేంద్ర బడ్జెట్ 2019 పై స్పందించారు కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్, దేశంలోని ధనవంతులకు మాత్రమే ఉపయోగపడేదిగా ఉందని ఆయన అన్నారు. ఇది అంబానీలకు ఉపయోగమే తప్ప మామూలు జనాలను ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పారు.
రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతున్న కేసీఆర్..
సీఎం కేసీఆర్ ప్రకటించిన రుణమాఫీపై ఇప్పటివరకూ స్పష్టత లేదని అన్నారు షబ్బిర్ అలీ. రైతు బంధు పథకం అందరికీ అందడంలేదని చెప్పారు. ఖరీఫ్ మొదలైనా.. విత్తనాలు, ఎరువులు ఇప్పటికీ పంపిణీ చేయలేదని తెలిపారు. కేసీఆర్ పాలనలో యువత, కార్మికులు, నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క డీఎస్సీ వేయలేదని.. రాష్ట్రంలో ప్రస్తుతం 4వేల స్కూళ్లను మూసివేసే పరిస్థితి ఉందని తెలిపారు. కేసీఆర్ చేసిన అప్పుల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పారు షబ్బిర్ అలీ.