ఎన్నికల కమీషన్ తీరు బాధాకరం: తులసీరెడ్డి

ఎన్నికల కమీషన్ తీరు బాధాకరం: తులసీరెడ్డి

కేంద్ర ఎన్నికల కమిషన్ వైఖరి పెను ప్రమాదకరంగా మారిందని కాంగ్రెస్ నేత, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసీ రెడ్డి అన్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్ అసమర్ధతతో అడుగడుగునా వైఫల్యాలే కనిపిస్తున్నాయన్నారు. ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నేతలు ఓటును డబ్బుతో, బంగారంతో కొంటుంటే ఎన్నికల కమిషన్ కు అవేవీ కనబడక పోవడం శోచనీయమన్నారు.

ఏపీలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ సక్రమంగా జరగలేదని, పోలింగ్ సమయంలో లా అండ్ ఆర్డర్ ఫెయిలైందని విమర్శించారు. ప్రధాన ప్రతి పక్షాలు కోరుతున్నట్లుగా వీవీ ప్యాడ్ లను లెక్కించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సెలక్టడ్ ఐటీ దాడులు, సెలక్టడ్ అధికారుల బదిలీలు ఎవరి మేలు కోసమని తులసి రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు.