దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం జరిగే వరకు పోరాడుతాం

V6 Velugu Posted on Oct 11, 2020

కేసీఆర్ ప్రభుత్వం లో దళితులకు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని కాంగ్రెస్ నేత‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దళితులకు ముఖ్యమంత్రి ప‌ద‌వి అని చెప్పి, సమాజంలో 50 లక్షల మంది ఉన్న మాదిగలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని అన్నారు. తన సామాజిక వర్గానికి అనేక ముఖ్యమైన పదవులు ఇచ్చిన సీఎం.. ద‌ళితుల‌కు మంత్రి పదవులు సంగ‌తేమో కానీ కనీసం బతకనివ్వడం లేదని అన్నారు. దళితులను చంపుతున్నారని, ఆత్మ హత్యలు చేసుకునేలా చేస్తున్నారన్నారు. వారి భూములు గుంజుకుంటున్నారని అన్నారు.

ఇవేవీ రాజకీయం కోసం తాము అనడం లేదని..తెలంగాణ ఉత్తర్ ప్రదేశ్ కంటే దారుణంగా తయారయింద‌ని అన్నారు. దళితులకు అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని. న్యాయపరంగా, విద్య, ఉద్యోగ, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా సహకారం అందిస్తామ‌ని ఉత్త‌మ్ చెప్పారు. తెలంగాణ లో ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా న్యాయం జరిగే వరకు పోరాడుతామ‌ని అన్నారు

Tagged Uttam Kumar Reddy, Congress Leader, KCR government, dalits, severe injustice

Latest Videos

Subscribe Now

More News