దోపిడీలో కేసీఆర్ కుటుంబం బరితెగించింది : విజయశాంతి

దోపిడీలో కేసీఆర్ కుటుంబం బరితెగించింది : విజయశాంతి

నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓటుతో ఇచ్చే తీర్పు.. ప్రజల తలరాత, వారి భవిష్యత్తు మార్చేలా ఉండాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేత విజయశాంతి. కేసీఆర్ 10 ఏళ్ల దోపిడీ, అరాచకాల పాలన నుంచి బయటపడేలా ఓటర్లు మంచి తీర్పు ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వకుండా.. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులను కేసీఆర్ కల్పించారని ఆరోపించారు. 

ప్రజలు చచ్చిపోయినా, పంట పొలాలు మునిగిపోయినా పర్వాలేదనుకునే వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఇలాంటి దోపిడీ చేసిన కేసీఆర్ కుటుంబం ఇంకా ఈ రాష్ట్రానికి కావాలా..? అని ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం స్కామ్ లో కుమార్తె (ఎమ్మెల్సీ కవిత) అరెస్ట్ కాకుండా చూసుకున్నారని ఆరోపించారు. దోపిడీలో కేసీఆర్ కుటుంబం బరితెగించిందన్నారు. అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ కొమ్ముకాయడం దౌర్భాగ్యం అని విమర్శలు చేశారు. 

వరంగల్ ప్రజలను కూడా మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి రాజకీయ పాఠాలు నేర్పించాలి.. అది  వరంగల్ నుంచి మొదలు పెట్టాలి అంటూ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ను రెండు సార్లు గెలిపించి మోసపోయాం.. ఈసారి కాంగ్రెస్ ను గెలిపిస్తాం అన్నారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక్కరికీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాఫియా కుటుంబాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటే అని చెప్పారు. ఎన్ని అడ్డదారులు తొక్కైనా బీఆర్ఎస్ ను గెలిపించాలని బీజేపీ చూస్తోందన్నారు.