
రాంపల్లిలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. సభలో మల్లారెడ్డి మాట్లాడుతుండగానే ఓ నాయకుడు అడ్డుకున్నాడు. దీంతో మల్లారెడ్డి తన స్పీచ్ ను ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మంత్రి మల్లారెడ్డి రాంపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనా.. దళితులకు ఏ పార్టీ నాయకులు ఏం చేయలేదన్నారు. దళితుల కోసం కేసీఆర్ చాలా మంచి పనులు చేశారని కొనియాడారు. దళితుల కోసం స్కూళ్లు, దళిత బంధు వంటి చాలా పథకాలు కేసీఆర్ ప్రవేశ పెట్టారని చెప్పారు. ఇంతలో స్టేజ్ పై ఉన్న కాంగ్రెస్ నాయకులు నల్లోల కుమార్ .. ఇది పార్టీ మీటింగ్ కాదంటూ మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు.అంబేద్కర్ గొప్పతనాన్ని చెప్పాలె కానీ.కేసీఆర్ గురించి కాదన్నారు. కేసీఆర్ దళితులను మోసం చేశారని వాదించారు. తానేమైనా తప్పు మాట్లాడానా అంటూ స్టేజ్ పై నుండి వెళ్లిపోయారు మల్లారెడ్డి.