సీఎం కేసీఆర్ టూర్... కాంగ్రెస్‌ నేతల ముందస్తు అరెస్టులు

సీఎం కేసీఆర్ టూర్... కాంగ్రెస్‌  నేతల ముందస్తు అరెస్టులు

సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు పలువురు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేశారు. భూనిర్వాసితుల సమస్యల పరిష్కారం కోరుతూ కాంగ్రెస్ ఈ రోజు నిరసనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు సీఎం పర్యటనను అడ్డుకునే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం నుంచి నియోజకవర్గవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషనకు తరలించారు. 

సీఎం కేసీఆర్ కాసేపట్లో నల్గొండ జిల్లాకు వెళ్లనున్నారు. దామరచర్లలో  యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్లకు చేరుకోనున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని మంత్రి జగదీష్ రెడ్డి సహా ఉన్నతాధికారులను అడిగి తెలుసుకుంటారు. అనంతరం అక్కడే సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం తిరిగి ప్రగతిభవన్ చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.