యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టు

యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టు

యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టు
ఓ వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
మరోవైపు యశ్వంత్‌‌‌‌ పర్యటనట్రాఫిక్‌‌‌‌ దారి మళ్లింపు.. 
సిటీ జనం తీవ్ర ఇబ్బందులు

మాదాపూర్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అడ్డుకునేందుకు యత్నించిన యూత్ కాంగ్రెస్​ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. శనివారం మాదాపూర్ యూత్ కాంగ్రెస్ నేత శివసేనారెడ్డి ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు హెచ్​ఐసీసీ నోవాటెల్​ను ముట్టడించేందుకు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న మాదాపూర్ జోన్ ఎస్​ఓటీ పోలీసులు హైటెక్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్న శివసేనారెడ్డి, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వైఎస్సార్ విగ్రహం వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు.