ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి దిష్టిబొమ్మ దహనం

ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి దిష్టిబొమ్మ దహనం

కోల్​బెల్ట్, వెలుగు: సీఎం రేవంత్​ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హుజూరాబాద్​ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్​ నేతలు దహనం చేశారు. క్యాతనపల్లిలో మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్​లీడర్ పార్వతి విజయ ఆధ్వర్యంలో లీడర్లు, కార్యకర్తలు కలిసి ఆర్కేపీ క్రాస్​ రోడ్ ​వద్ద ఆందోళన చేపట్టారు. పార్వతి విజయ మాట్లాడుతూ.. సీఎం రేవంత్​పై ఇష్టానుసారంగా మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్​ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. 

బీఆర్ఎస్​ పదేండ్ల పాలనలో ఒక్క డబుల్​ బెడ్రూం ఇల్లు, రేషన్​ కార్డులు ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్ ​రెడ్డి హయంలో కాంగ్రెస్​సర్కార్​అర్హులందరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్​కార్డులు మంజూరు చేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని గ్యారంటీలను అమలు చేస్తున్న కాంగ్రెస్​ సర్కార్​పై బీఆర్ఎస్ ​లీడర్లు అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేదిలేదన్నారు. కౌశిక్​ రెడ్డి వెంటనే సీఎంకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. మాజీ ఎంపీటీసీ రాంటెంకి విజయ, బెదిరి లక్ష్మి, పద్మ, కల్పన, విజయలక్ష్మి, సీత, రాజేశ్వరి, శారద తదితరులు పాల్గొన్నారు.