మంచిర్యాలలో సీఎం ఫొటోకు క్షీరాభిషేకం

మంచిర్యాలలో సీఎం ఫొటోకు క్షీరాభిషేకం

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మార్కెట్ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్, సెంట్రల్ లైటింగ్, రోడ్ల పనులకు రూ.78 కోట్లు మంజూరు చేయడంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. 

శుక్రవారం అర్చన టెక్స్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. వ్యాపారస్తులతో కలిసి పటాకలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.