
- ఎస్సీ వర్గీకరణను ఎమ్మెల్యే అడ్డుకోలేదు
- మాలలకు న్యాయం చేయాలని పోరాడారు
- ఐఎన్టీయూసీ లీడర్ల వ్యాఖ్యలను ఖండిచిన కాంగ్రెస్ నేతలు
కోల్‌బెల్ట్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కాకా కుటుంబంపై అసత్యపు ఆరోపణలు చేస్తే సహించేదిలేదని కాంగ్రెస్ లీడర్లు హెచ్చరించారు. సోమవారం మందమర్రిలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొతుకు సుదర్శన్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లూరి లక్ష్మణ్, పైడిమల్ల నర్సింగ్మాట్లాడారు. ఎమ్మెల్యే వివేక్, ఎంపీ గడ్డం వంశీకృష్ణను విమర్శించే అర్హత ఐఎన్టీయూసీ లీడర్ కాంపెల్లి సమ్మయ్యకు లేదన్నారు.
ఎస్సీ వర్గీకరణను వివేక్ వెంకటస్వామి ఎప్పుడూ అడ్డుకోలేదని.. మాలలకు న్యాయం చేయాలని పోరాడారని స్పష్టం చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఐఎన్టీయూసీ లీడర్జనక్ప్రసాద్ మెప్పుకోసమే ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పార్లమెంట్‌పరిధిలో కాకా కుటుంబం చేసిన అభివృద్ధి పనులను గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. సమావేశంలో ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు నెరువట్ల శ్రీనివాస్, మైనార్టీ అధ్యక్షులు ఎండీజమీల్, లీడర్లు గుడ్ల రమేశ్, ఎండీ పాషా, కనకంరాజు, ఎండీ సుకుర్, తిరుమల్ రెడ్డి, ఉదయ్, మాయ తిరుపతి, ప్రభాకర్, శంకర్ గౌడ్, ఆంజనేయులు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు
చెన్నూరు, వెలుగు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలను చెన్నూరు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. చెన్నూరులో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతారని అనడం సమంజసం కాదని.. కావాలనే ఎమ్మెల్యే ప్రతిష్టను దెబ్బతీయాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక, అక్రమ వ్యాపారాలకు ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారనే అక్కసుతోనే ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మరోసారి ఎమ్మెల్యే వివేక్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చెన్న సూర్యనారాయణ, మాజీ జడ్పీటీసీ కర్ణ సాగర్ రావు, సీనియర్ నేత హేమవంత రెడ్డి, చెన్నూరు, కోటపల్లి మండలాల అధ్యక్షులు బాప గౌడ్, మహేశ్ తివారీ, మోహన్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.