రిపబ్లిక్ డే రోజున ఇద్దరు కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని పార్టీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా జరిగింది. జెండా ఎగురవేసేటపుడు ఇద్దరు కాంగ్రెస్ నాయకులు దేవేంద్ర సింగ్ యాదవ్ , చందు కుంజీర్ గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. తర్వాత పోలీసులు జోక్యం చేసుకోవడంతో సద్గుమణిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గొడవ తర్వాత దేవేంద్ర సింగ్ యాదవ్ చందు కుంజీర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
#MadhyaPradesh: Congress leader Devendra Singh Yadav has filed a police complaint against party leader Chandu Kunjir, after the two had a brawl during #RepublicDay celebrations at the party office in Indore, earlier today. https://t.co/2OqQkHts47
— ANI (@ANI) January 26, 2020
