
- ఉద్యోగుల భర్తీపై డిప్యూటీ సీఎంతో అద్దంకి, చనగాని భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై, ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రజా భవన్‌లో భట్టితో భేటీ అయ్యారు.
నిరుద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని, వారంలోగా ప్రజా భవన్‌లో నిరుద్యోగులతో సమావేశం అయ్యేందుకు ఆయన అంగీకరించినట్టు తెలిపారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా భట్టి అన్నట్లు వారు చెప్పారు.