బడంగ్ పేట్ లో కారెక్కిన కాంగ్రెస్ నేతలు

బడంగ్ పేట్ లో కారెక్కిన కాంగ్రెస్ నేతలు

రాష్ట్ర సాధనే ద్వేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ నేడు రాష్ట్ర ప్రజల ఇంటి పార్టీగా అందరి మన్ననలు పొందుతుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని తిరుమల నగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు 50 మంది యువకులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 

బడంగ్ పేట్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తిరుమల నగర్ కు చెందిన రత్నంకు, పలువురు యువ నేతలకు మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం పనిచేసే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.