
వరుసగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా తమ పదవులకు రాజీనామా చేస్తుండటం అధిష్టానాన్ని అయోమయానికి గురి చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి కీలక నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన రాహుల్ గాంధీ రాజీనామ చేశారు. రాహుల్ గాంధీ తిరిగి భాద్యతలు చేపట్టాని, పార్టీ నేతలు కోరారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం ససేమీరా అనడంతో.. పార్టీ ఓటమీకి నైతిక బాధ్యత వహిస్తూ పలు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ఇంచార్జులు రాజీనామ చేశారు.
వివేక్ టంకా రాజీనామాతో మిగతా నేతలు రాజీనామాల బాట పట్టారు. కరీంనగర్ మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా 140 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు.
మరోవైపు ఇవాళ ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో ..పార్టీ అధ్యక్షుడిగా మళ్లీ తిరిగి రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని కోరామన్నారు ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్. పార్టీలో ప్రక్షాళన మొదలైందని.. యువతకు ప్రాధాన్యత పెరగనుందన్నారు. దేశవ్యాప్తంగా PCC లో మార్పులు ఉండే అవకాశం ఉందన్నారు.