
న్యూఢిల్లీ, వెలుగు: లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ అధిష్టానం సోమవారం రిలీజ్ చేయనున్నది. గతవారం భేటీ అయిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) తెలంగాణతో పాటు దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపింది. అలాగే, ఉత్తరాది నుంచి ఢిల్లీ, హర్యానా, ఇతర రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు చేసింది. దాదాపు 60 స్థానాలకు పైగా అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించింది. ఫస్ట్ లిస్ట్ లో కేవలం తెలంగాణ, కర్నాటక, చత్తీస్గఢ్, కేరళ, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 39 మంది అభ్యర్థులనే ప్రకటించింది.
గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పార్టీ జనరల్ సెక్రటరీ అప్పడే స్పష్టం చేశారు. 11వ తేదీన రెండో జాబితా రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. రెండో జాబితాలో తెలంగాణ నుంచి మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఫస్ట్ మీటింగ్ లో మొత్తం 9 నుంచి 11 స్థానాల అభ్యర్థులపై చర్చించి.. నలుగురిని ఫైనల్ చేశారు.