కాంగ్రెస్ మేనిఫెస్టోతో మరింత జోష్: కోట నీలిమ

కాంగ్రెస్ మేనిఫెస్టోతో మరింత జోష్: కోట నీలిమ

సికింద్రాబాద్​, వెలుగు: కాంగ్రెస్ మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు సమ న్యాయం దక్కుతుందని ఆ పార్టీ సనత్​నగర్ సెగ్మెంట్ అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. శుక్రవారం అమీర్​పేట డివిజన్​లోని బుద్ధనగర్, అంకమ్మ బస్తీ, సిక్ వాడిలో ఇంటింటికి తిరుగుతూ ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు ఆమె గాంధీభవన్​కు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిశారు. మేనిఫెస్టో రిలీజ్ ప్రోగ్రామ్​లో పాల్గొన్నారు. అనంతరం సనత్ నగర్​లోని పలు బస్తీలు, కాలనీల్లో ఆమె పాదయాత్ర చేపట్టారు. 

ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ.. మేనిఫెస్టోతో జనాలకు తమపై పూర్తి నమ్మకం ఏర్పడిందన్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ తేదీలతో సహా ప్రకటించే దమ్ము బీఆర్ఎస్, బీజేపీలకు లేదన్నారు. తొమ్మిదిన్నరేండ్లుగా బీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీకేగూడ మసీదు వద్ద కార్యకర్తలతో కలిసి ఆమె ర్యాలీ నిర్వహించారు. మైనార్టీలు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని స్థానిక ముస్లింలు ప్రకటించారు.