తెలంగాణలో ఏదో ఒకరోజు రైతు ఉద్యమం వస్తది

తెలంగాణలో ఏదో ఒకరోజు రైతు ఉద్యమం వస్తది

మెదక్ జిల్లాలో ఏకగ్రీవం కాకుండా చేయడమే తమ మొదటి విజయమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్ అభ్యర్దిని పెట్టడంతో అందరికీ హరీష్ టచ్ లోకి వెళ్ళాడని.. ఇది తమ రెండో విజయమన్నారు. ట్రబుల్ షూటర్ అని చెప్పుకునే హరీష్.. ఈ ఎన్నికల్లో ట్రబుల్స్ పడ్డాడని.. ఇది తమ మూడో విజయమన్నారు. మెదక్ లో కాంగ్రెస్ కు 230 కంటె ఒక్క ఓటు తక్కువ వచ్చినా వర్కింగ్ ప్రెసిడెంట్ కి రాజీనామా చేస్తానన్న..  ఈ విషయంపై 14 తర్వాత  స్పందిస్తానన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలలో తాను ఇన్వాల్వ్ కాలేదన్నారు.  జిల్లా రాజకీయాల మీదనే దృష్టి పెట్టానన్నారు. జిల్లాలో తమ పార్టీ ఓట్లు కూడా తమకు పడకపోతే తానే బాధ్యుడినన్నారు. వరి వద్దనే.. అధికారం రాష్ట్రానికి, కేంద్రానికి లేదన్నారు. ప్రజా స్వామ్యంలో ప్రజలకు అనుకూల నిర్ణయాలు ఉండాలన్నారు. తెలంగాణలో కూడా ఏదో ఒకరోజు రైతు ఉద్యమం వస్తదన్నారు.