
హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల ముందు…నాయకత్వ మార్పు అవసరం అన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సీఎల్పీ సమావేశాని హాజరైన ఆయన… అసెంబ్లీలో ఓడిపోయిన నాయకత్వంతోనే లోక్ సభ ఎన్నికలకు వెళ్తుంటే జోష్ రావటం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 8 సీట్లు గెలుచుకుంటామన్నారు. నాయకత్వాన్ని మార్చాలని అధిష్టానాన్ని కోరుతున్నాన్నారు రాజగోపాల్ రెడ్డి.