నల్గొండ సభతో కొత్త నాటకం : మల్‌‌​రెడ్డి రంగారెడ్డి

నల్గొండ సభతో కొత్త నాటకం : మల్‌‌​రెడ్డి రంగారెడ్డి
  •     కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

హైదరాబాద్, వెలుగు :  కాళేశ్వరం వంటి పనికి మాలిన ప్రాజెక్టుతో తెలంగాణను నిండా ముంచిన బీఆర్‌‌‌‌ఎస్ అధినేత కేసీఆర్.. ఇప్పుడు నల్గొండలో సభ పెట్టి కొత్త నాటకం ఆడబోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌‌​రెడ్డి రంగారెడ్డి విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, సంజీవరెడ్డి, లక్ష్మణ్​కుమార్‌‌‌‌తో కలిసి ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధుల పేరుతో ఉద్యమం చేసిన ఆయన..

 తెలంగాణ వచ్చాక నీళ్లు ఎంత ఇచ్చారు, నిధులు ఎంత ఖర్చు చేశారన్న విషయంపై అసెంబ్లీలో చర్చ జరిగితే ముఖం చాటేశారని మండిపడ్డారు. పదేండ్లు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పే దమ్ము కేసీఆర్‌‌‌‌కు లేదన్నారు. గతంలో నీళ్ల గురించి గొప్పగా మాట్లాడిన కేసీఆర్.. ఇప్పుడు అదే నీళ్లపై చర్చ జరుగుతుంటే ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. 

కేసీఆర్ పాలనలో తెలంగాణను రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చి, ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితిని తెచ్చారని ఆరోపించారు. కేసీఆర్ నల్గొండకు రావాలంటే ముందు ముక్కు నేలకు రాయాలన్నారు. నల్గొండ, మహబూబ్‌‌నగర్, రంగారెడ్డి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.