- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరు చూసి జనం అసహ్యించుకుంటున్నరని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. శనివారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిట్ విచారణకు హాజరైన సందర్భంలో కేటీఆర్‌కు పోరాటయోధుడి మాదిరిగా పార్టీ కార్యకర్తలు వీర తిలకం దిద్దడం, వాళ్లు చేసిన హడావుడిని చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు.
ప్రజలను రెచ్చగొట్టి బతకడమే బీఆర్ఎస్ నాయకుల పనిగా మారిందని, దొంగ యూట్యూబ్ చానెళ్లు పెట్టి తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
