
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినేట్ విస్తరణలో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని మాదిగ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరారు. సోమవారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల శామ్యూల్, లక్ష్మీకాంతరావు, విప్ అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ కలిసి వినతిపత్రం అందచేశారు.
రాష్ట్రంలో 50 లక్షల మందికిపైగా మాదిగలు ఉన్నారని చెప్పారు. స్వాతంత్ర్య్ం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ కు మాదిగలే ప్రధాన ఓటు బ్యాంకని గుర్తుచేశారు. ఎంపీ ఎన్నికల్లో మాదిగలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని అయినా.. 8 సీట్ల గెలుపులో మాదిగలు కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు.