ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల అడ్డగింత

 ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల అడ్డగింత

జయశంకర్ భపాలపల్లి జిల్లా:  కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన.. మేడిగడ్డ  ముంపు బాధితులను పరామర్శించడానికి  వెళ్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవనరెడ్డి తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. భూపాలపల్లిలోని మంజూనగర్ వద్ద కాంగ్రెస్ నాయకులను పోలీసుల అడ్డుకుని నిలిపేశారు. దీంతో పోలీసులపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగునా ఆటంకాలు  ఎందుకు కల్గిస్తున్నారంటూ మండిపడ్డారు. తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
పోలీసులతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వివాదం తీవ్ర స్థాయిలో చేరడంఉద్రిక్తతకు దారితీసింది. భారీ సంఖ్యలో తరలివస్తున్న కాంగ్రెస్ కార్యర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు కాంగ్రెస్ ముఖ్య నాయకులను ఒకరొకరి తర్వాత మరికొరిని అదుపులోకి తీసుకుని వాహనాల్లో ఎక్కించి భూపాలపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు. తమను బలవంతంగా అరెస్టు చేయడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించి తీరుతామని చెబుతున్నారు.