
- హరీశ్ రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సవాల్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్పీసీ ఘోష్ రిపోర్టు ఇచ్చిన తర్వాత హరీశ్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ నేతల ప్రకటనలు చూస్తే నవ్వొస్తున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తప్పుచేసి దబాయిస్తామంటే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు.
కాళేశ్వరంపై అసెంబ్లీలో తేల్చుకుందాం రా..”అంటూ హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. ఘోష్ రిపోర్టుతో ప్రజల ముందు ముద్దాయిలుగా నిలబడకతప్పదేమోననే ఆందోళనతో కేసీఆర్, హరీశ్రిపోర్ట్పై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ ఎందుకు కూలిపోయిందన్న దానికి హరీశ్ సమాధానం చెప్పకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.