
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కన్ఫ్యూజన్‌లో మాట్లాడినట్లు ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. బుధవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఫ్లైట్ మోడ్‌లో ఉన్నారని కవిత అంటున్నారని.. అయితే, ఆమె వాళ్ల నాన్న కేసీఆర్‌ను అనబోయి రేవంత్‌ను అన్నట్లుందని ఎద్దేవా చేశారు.
18 నెలల నుంచి మీ నాయన కేసీఆర్ ఫ్లైట్ మోడ్‌లో ఉన్నాడు. మీ అన్న సైలెంట్ మోడ్‌లో ఉన్నాడు. మీ బావ పాజ్ మోడ్‌లో ఉన్నాడు. మొత్తంగా మీ పార్టీ డిస్మాండిల్ మోడ్‌లో ఉంది’’అని విమర్శించారు. ఫ్లైట్ మోడ్‌లో ఉన్న కేసీఆర్‌ను బయటకు తీసుకొచ్చి బీసీ బిల్లుపై బీఆర్ఎస్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు.